Wish you happy birthday Mr Rakesh, our donor            

ఆకలి రాజ్యం భారత్.. 19.4 కోట్లమంది అన్నార్తులు

The report 2015 of the “Food and Agriculture Organization of the Unites Nations” showing that India stands first in the state of food insecurity in the world. This is an article published in Telugu daily news paper “Andhrajyothi” on 29th May 2015. The report also says that only 72 countries in the world have achieved Millennium Development Goals (MDGs). Let us hope that our National, State and Local leaders will make proper decisions at least to give food security to the poorest of the poor.

  • అన్నమో రామచంద్ర అంటున్న దేశం
  • ఐక్యరాజ్యసమితి నివేదికలో అగ్రస్థానం
  • ప్రపంచ వ్యాప్తంగా తిండి లేని వారు 79.5 కోట్లు
  • చైనాలో సగానికిపైగా తగ్గిన ఆకలి మంటలు
  • ఆహారభద్రతలో ఎన్డీయే ప్రభుత్వం విఫలం
  • ఐరాస నివేదికతో దేశాన్ని అప్రతిష్ఠ పాల్జేశారు: సీపీఎం 

రోమ్‌/న్యూఢిల్లీ, మే 28: కడుపు నిండా తిండి.. ఒళ్లు దాచుకోవడానికి బట్ట.. నీడ కోసం గూడు ఈ మూడుంటే చాలు జీవితం సాఫీగా గడిచిపోతుందని అనుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ, దేశంలో కొన్ని కోట్ల మంది అన్నమో రామచంద్ర అంటూ ఆకలితో అలమటించిపోతున్నారు. భారత్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిన సత్యమిది! ప్రపంచంలోనే ఆకలిరాజ్యాల్లో భారత్‌ అగ్రరాజ్యంగా నిలిచింది. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) నివేదిక ‘ద స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ఇన్‌సెక్యూరిటీ ఇన్‌ ద వరల్డ్‌ 2015’ ప్రకారం దాదాపు 19.4 కోట్ల మంది తిండికి నోచుకోక ఆకలితో మలమల మాడిపోతున్నారట! ఇక మొత్తంగా ప్రపంచంలో 79.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. 1990-92లో వంద కోట్లు ఉన్న ఆ సంఖ్య 2014-15 కాలానికి చాలా తగ్గిపోయింది. భారత్‌లోనూ అది తగ్గినప్పటికీ ఆకలి రాజ్యాల్లో టాప్‌గా నిలవడం గమనార్హం. నివేదిక ఆధారంగా 1990-92లో భారత్‌లో సుమారు 21 కోట్ల మందికి పూట గడవడం కష్టంగా ఉండేది. భారత్‌లో ఆకలిదప్పులు గణనీయంగా తగ్గినప్పటికీ, ఆకలి, పేదరిక నిర్మూలనకు సామాజిక కార్యక్రమాలను ఇంకా సమర్థంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎఫ్‌ఏవో నివేదికలో పేర్కొన్నారు.

కాగా, 90వ దశకంలో ఈ జాబితాలో 28.9 కోట్లమందితో చైనానే అగ్రస్థానంలో ఉన్నా.. దానిని సగానికిపైగా తగ్గించడంలో ఆ దేశం సఫలమైందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశంలో 13.38 కోట్ల మంది ఆకలి మంటలతో అల్లాడుతున్నారు. కాగా, ఎఫ్‌ఏవో పర్యవేక్షిస్తున్న 129 దేశాల్లో 72 దేశాలు.. 2015 నాటికి పోషకాహార లోపాన్ని సగానికి తగ్గించాలన్న మిలీనియం డెవలప్‌మెంట్‌ లక్ష్యాన్ని చేరాయని నివేదికలో సంస్థ పేర్కొంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం కొద్ది తేడాతో ఆ మార్కును చేరుకోలేకపోయాయని తెలిపింది. మెరుగైన ఆర్థిక వృద్ధి, వ్యవసాయ పెట్టుబడులు, సామాజిక భద్రత, రాజకీయ స్థిరత్వంతో ఆకలిని తరిమికొట్టొచ్చని ఆ నివేదికలో పేర్కొన్నారు.

కాగా, ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా ఎన్డీయే ప్రభుత్వంపై సీపీఎం విమర్శలు గుప్పించింది. ఆహార భద్రతలో కేంద్రం ఘోరంగా విఫలమైందని, తద్వారా దేశాన్ని అప్రతిష్ఠ పాల్జేసిందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ విరుచుకుపడ్డారు. అంతేగాకుండా రెండేళ్లలో పోషకాహార లోపం తగ్గుదల రేటు తగ్గిపోవడంపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మోదీ ఏడాది పాలనతో పాటే.. ఐక్యరాజ్యసమితి నివేదిక దేశానికి అప్రతిష్ఠ తెచ్చింది. ఇదంతా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆహార భద్రతలో ఘోరంగా విఫలమవడం వల్లే జరిగింది’’ అని బృందా కరత్‌ అన్నారు. అది చేశాం.. ఇది చేశాం అని చెప్పుకొంటున్న మోదీ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉండిపోయిందని విమర్శించారు.